This Week Launching Mobiles: ఈ వారంలో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్.. ఏయే కంపెనీలు ఫోన్లు లాంచ్ చేస్తున్నాయంటే..?

This Week Launching Mobiles: వాతావరణ వేడి పెరుగుతోంది. దానితో పాటు భారతీయ మొబైల్ మార్కెట్ వేడి కూడా పెరుగుతోంది. ఈ ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో డజనుకు పైగా కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే వారంలో ఏప్రిల్ 21- 26 మధ్య అనేక కొత్త 5G ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఒప్పో, వివో, రియల్‌మి వంటి బ్రాండ్లు తమ కొత్త ఫోన్లను పరిచయం చేయబోతున్నాయి. ఈ వారం దేశంలో లాంచ్ కానున్న ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
OPPO K13 5G
ఒప్పో ఈ వారం 5G ఫోన్‌లను లాంచ్ చేయనుంది. కంపెనీ తన ‘K’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. దీనిని రూ. 20,000 కంటే తక్కువ బడ్జెట్‌లో విడుదల చేయచ్చు. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో పెద్ద బ్యాటరీ ఉంటుంది. దీనిలో 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీ అందించారు. అలానే 6.66-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుందని చెబుతున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఈ 5G ఫోన్‌లో 50MP AI కెమెరా ఉంటుంది.
Vivo T4 5G
వివో కొత్త 5G ఫోన్ T4 ఏప్రిల్ 22న భారతదేశంలో లాంచ్ కానుంది. కంపెనీ దీనిని కేవలం 0.789 సెం.మీ మందంతో 7,300mAh బ్యాటరీ కలిగిన అత్యంత సన్నని ఫోన్ అని పిలుస్తోంది. అలానే 7,300mAh బ్యాటరీతో పాటు, ఈ ఫోన్ 90W ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీని కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లో 12జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. 6.67 అంగుళాల 120Hz అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం, వెనుక ప్యానెల్‌లో 50MP వెనుక కెమెరాను చూడచ్చు, అయితే ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.
OPPO A5 Pro 5G
ఈ ఒప్పో 5G ఫోన్ ఏప్రిల్ 24న భారతదేశంలో లాంచ్ అవుతుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.17,999కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ ధర రూ.19,999. దీనిని మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో తీసుకురావచ్చు. పవర్ బ్యాకప్ కోసం, 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 5,800mAh బ్యాటరీ అందించే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ కోసం 50MP కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ 5G ఒప్పో మొబైల్ 6.67-అంగుళాల 120Hz స్క్రీన్‌తో రావచ్చు.
Realme 14T 5G
రియల్‌మి 14T ఏప్రిల్ 25న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ 5G ఫోన్ 6,000mAh బ్యాటరీతో మార్కెట్లోకి వస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్ 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది, ఇది AI ఫీచర్లతో ఉంటుంది. ఈ మొబైల్‌లో IP69 రేటింగ్, 300శాతం అల్ట్రా వాల్యూమ్ మోడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ 5G మొబైల్ ఫోన్ సిల్కెన్ గ్రీన్, వైలెట్ గ్రేస్, శాటిన్ ఇంక్ కలర్స్‌లో అమ్మకానికి ఉంటుంది.
OnePlus 13T
వన్‌ప్లస్ 13T ఏప్రిల్ 24న చైనాలో లాంచ్ కానుంది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ 5G ఫోన్‌ను 12జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో లాంచ్ చేయవచ్చు. పవర్ బ్యాకప్ కోసం, దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6,100mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50MP+50MP వెనుక కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.3-అంగుళాల 1.5K OLED స్క్రీన్ లభిస్తుంది.