Vivo Y28s 5G: భారీ డీల్.. అస్సలు మిస్ అవ్వద్దు.. Vivo Y28s 5Gపై డిస్కౌంట్ల జాతరే..!

Vivo Y28s 5G: వివో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. కంపెనీ తన ‘Y’ సిరీస్ 5G ఫోన్ల ధరను భారీగా తగ్గించింది. ‘Vivo Y28s 5G’ మొబైల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇది గత ఏడాది జూలైలో విడుదలైంది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. రండి.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
రూ. 12,000 బడ్జెట్‌లో కొత్త 5G మొబైల్ కొనాలనుకుంటే, Vivo Y28s 5G ఫోన్ మంచి ఆప్షన్. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో 6.56-అంగుళాల 90Hz డిస్‌ప్లే ఉంది. ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది IP64 రేటింగ్, 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Vivo Y28s 5G Offers
ఈ మొబైల్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.13,999కు లాంచ్ అయింది. 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.15,499. 8GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న ఫోన్‌ను రూ.16,999కి లాంచ్ చేశారు. ఈ వివో ఫోన్ వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం Vivo Y28s 5G మొబైల్ 4GB RAM + 128GB స్టోరేజ్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మీరు దీన్ని 27శాతం డిస్కౌంట్‌తో 12,999కి కొనుగోలు చేయచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. దీనితో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.11,999కి కొనుగోలు చేయచ్చు.
Vivo Y28S 5G Features
ఈ ఫోన్ 6.56-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది వాటర్‌డ్రాప్ నాచ్ స్టైల్ LCD డిస్‌ప్లే. ఈ స్క్రీన్ 1612 × 720 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనికి గ్లోబల్ DC డిమ్మింగ్, లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ OS 14 పై నడుస్తుంది. ఈ మొబైల్ ర్యామ్‌ను 8జీబీ వరకు, స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు.
మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈస్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి, 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు.
స్మార్ట్‌ఫోన్‌ను డస్ట్, వాటర్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP64 రేటింగ్ ఉంది. ఇది FM రేడియో, 3.5మిమీ ఆడియో జాక్, 150శాతం వాల్యూమ్ బూస్ట్, స్ప్లిట్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికల పరంగా, ఈ ఫోన్‌లో 5G, Wi-Fi, బ్లూటూత్ 5.4,USB టైప్ C పోర్ట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- OPPO K13 5G Launch Tomarrow: దీన్ని కొట్టేది లేదు.. రేపే ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. దీని ముందు ఏ ఫోను పనికిరాదు..!