Last Updated:

WTC Final: శుభ్ మన్ గిల్ కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. టీమిండియా, ఆసీసీ ఫీజుల్లో కోత

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిదే. అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

WTC Final: శుభ్ మన్ గిల్ కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. టీమిండియా, ఆసీసీ ఫీజుల్లో కోత

WTC Final: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిదే. అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. రోహిత్‌ సేన మొత్తానికి మ్యాచ్‌ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపింది.

అదే విధంగా టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియాకు కూడా ఐసీసీ జరిమానా విధించింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగానే ఆసీస్‌ జట్టుకు కూడా మ్యాచ్‌ ఫీజులో 80 శాతం కోత విధించింది. ఇందుకు సంబంధించి ఐసీసీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో భారత్‌ 5 ఓవర్లు, ఆస్ట్రేలియా 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్‌ చేశాయని ఐసీసీ పేర్కొంది.

 

గిల్‌కు అదనపు జరిమానా(WTC Final)

మరో వైపు టీమిండియా ఓపెనర్‌ శుభమన్ గిల్‌ కు ఎక్స్ ట్రా ఫైన్ వేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో శుబ్ మన్ గిల్‌ అవుట్ అయిన తర్వాత అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకోసం మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. అంటే మొత్తంగా గిల్‌కు 115 శాతం జరిమానా పడినట్టు అయింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (18) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్ బొలాండ్ వేసిన ఎనిమిదో ఓవర్‌ తొలి బంతిని స్లిప్‌లో కామెరూన్‌ గ్రీన్‌ ఒక చేత్తో క్యాచ్‌ పట్టుకున్నాడు. అయితే, ఈ క్యాచ్‌ వివాదస్పదంగా మారింది. నేలకు తాకిన తర్వాత బంతిని గ్రీన్‌ అందుకున్నట్టు స్పష్టంగా కనిపించింది. కానీ, థర్డ్ అంపైర్‌ అవుట్ గా ప్రకటించాడు. దీంతో గిల్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఈ అంశంపై గిల్‌ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. కామెరూన్ గ్రీన్ బంతిని పట్టుకునే ఫొటో షేర్ చేసిన గిల్.. థర్డ్ అంపైర్‌కు కళ్లు సరిగ్గా కనిపించలేదా? అనే అర్థం వచ్చేలా ఎమోజీలు పోస్ట్‌ చేశాడు.

అతడు చేసింది తప్పిదమే(WTC Final)

దీంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ గిల్‌కు అదనపు జరిమానా పడింది. ‘గిల్‌ అవుట్‌ విషయంలో టెలివిజన్‌ అంపైర్ ఇచ్చిన నిర్ణయం సరైనదే. ఆ తర్వాత రోజు గిల్‌ ఈ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఐసీసీ ఆర్టికల్‌ 2.7  నిబంధన కింద అతడు చేసింది తప్పు’ అని ఐసీసీ ప్రకటనలో వెల్లడించింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ ఘోర పరాజయం మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 469 భారీ ఆధిక్యం వచ్చింది. టీంఇండయా మాత్రం 296 పరుగులకే చతికిలపడింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 270 పరుగులు చేయగా.. రోహిత్‌ సేన 234 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.