Champions Trophy 2025: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్
![Champions Trophy 2025: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/bumrah.jpg)
Bumrah out, Rana in for Champions Trophy 2025: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత పేసర్ బుమ్రా దూరమయ్యారు. గత కొంతకాలంగా మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులోకి వస్తాడని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ వెన్నునొప్పి కారణంగా ఈ ట్రోఫీకి దూరమవుతున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఆడనున్నారు. అలాగే యశస్వీ జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ ఎంపిక చేసింది.
ఇక, యశస్వీ జైస్వాల్, మహ్మద్ సిరాజ్, దూబే నాన్ ట్రావెలింగ్ సబ్ స్టిట్యూట్స్‌గా ఉంటారని, అవసరమైనపుడు దుబాయ్ వెళ్లనున్నట్లు పేర్కొంది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని జట్లు తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. స్క్వాడ్‌లో మార్పులు చేసుకునేందుకు అధికారికంగా ఇంకా మూడు రోజుల గడువు ఉంది.
జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్,సుందర్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.