Last Updated:

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ‌పై సందిగ్ధత

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ‌పై సందిగ్ధత

ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ‌పై సందిగ్ధత కొనసాగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ టోర్నీకి ఎట్టిపరిస్థితుల్లో టీమిండియాను పంపమని బీసీసీఐ భీష్మించుకుని కూర్చోగా, ‘ప్లీజ్.. రండి’ అని పాక్ క్రికెట్ బోర్టు బతిమాలుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది.

ఈ ట్రోఫీ కోసం ఒకవేళ నిజంగానే భారత్ తమ దేశంలో ఆడేందుకు రాకపోతే, రాబోయే రోజుల్లో భారత్‌లో జరిగే ఈ మ్యాచ్‌కూ మా జట్టు రాదని ఆ దేశ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ స్పష్టం చేశారు. రాబోయే ఆరేళ్లలో భారత్ 5 మెగాటోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుందని ఆయన గుర్తుచేశారు.