Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీ ప్రకటన.. విన్నర్ జట్టుకు బంఫర్ ఆఫర్..!

Prize money for ICC Men’s Champions Trophy 2025 Winners: ఛాంపియన్స్ ట్రోఫీ సమయం దగ్గరపడుతోంది. పాకిస్థాన్ ఆతిథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఈ మేరకు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ ట్రోఫీలో ఎనిమిది కీలక జట్లు తలపడనున్నాయి. అయితే టీమిండియా ఆడనున్న మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న తలపడనుంది. తాజాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన ప్రైజ్ మనీని ప్రకటించింది.
ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా టోర్నీ విన్నర్ జట్టుకు రూ.20.8 కోట్లు ప్రకటించగా.. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.10.4కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే సెమీ ఫైనల్‌కు చేరిన రెండు జట్లకు రూ.5.2 కోట్లు ఇవ్వనుండగా.. ఐదో స్థానం, ఆరోస్థానం జట్లకు రూ.3కోట్లు.. ేడు, ఎనిమిదొ స్థానాల జట్లకు రూ.1.2కోట్లు ఇవ్వనుంది. ఈ మేరకు మొత్తం రూ.60 కోట్ల ప్రైజ్ మనీని అన్ని జట్లకు ఇవ్వనుండగా.. ప్రతి మ్యాచ్‌కు రూ.29లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనుంది.