India vs Bangladesh: గిల్ సూపర్ సెంచరీ.. బంగ్లాదేశ్‌పై భారీ విజయం

India won the match against bangladesh in champions trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ విజయంతో ప్రారంభించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. 229 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో 231 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(101) సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41), కోహ్లీ(22), శ్రేయస్ అయ్యర్(15), అక్షర్(8) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ 2 వికెట్లు పడగొట్టగా.. టస్కిన్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.