Published On:

IPL 2025 41st Match: ముంబైతో మరో ఆసక్తికపోరు.. హోంగ్రౌండ్ హైదరాబాద్‌కు కలిసొస్తుందా?

IPL 2025 41st Match: ముంబైతో మరో ఆసక్తికపోరు.. హోంగ్రౌండ్ హైదరాబాద్‌కు కలిసొస్తుందా?

Sunrisers Hyderabad vs Mumbai Indians, IPL 2025 41st Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఓడించింది. ఈ మ్యాచ్‌లో సొంతగడ్డపై ముంబైపై ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా? చూడాలి.

 

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా.. 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మిగతా 4 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇక, ముంబై ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలుపొందగా.. మరో 4 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది.

 

జట్టు అంచనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షిత్ పటేల్, జీషాన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ.

 

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్.