IPL 2025 40th Match: లక్నోలోనూ ఢిల్లీదే ఆధిపత్యం.. ఫ్లేఆప్స్ రేసులోకి

Delhi Capitals won the match Against Lucknow: ఐపీఎల్ 2025 రసవత్తరంగా కొనసాగుతోంది. 18వ సీజన్‌లో భాగంగా కీలక 40వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తడబడింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నోపై ఢిల్లీదే ఆధిపత్యం కొనసాగింది. లక్నో జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై లక్నోను చిత్తు చిత్తు చేసి ఫ్లేఆప్స్ రేసులో దూసుకెళ్తూ తన ఖాతాలో 6వ విజయం నమోదు చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్‌క్రమ్(52), మిచల మార్ష్(45) సూపర్ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. చమీర బౌలింగ్‌లో మార్‌క్రమ్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన పూరన్(9) దూకుడు ప్రదర్శించాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టిన పూరన్‌ను స్టార్క్ బౌల్డ్ చేసి వెనక్కి పంపాడు. సమద్(2), మార్ష్ ఔట్ కావడంతో 23 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. ఆయుష్ బదోని(36), మిల్లర్(14) ఇన్నింగ్స్ చక్కదిద్దడంతో లక్నో 159 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ 4 వికెట్లు పడగొట్టగా.. చమీర, స్టార్క్ చెరో వికెట్ తీశారు.
160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్(51)మెరుపు ఇన్నింగ్స్‌తో ఆడగా.. దూకుడుగా ఆడుతున్న కరుణ్ నాయర్(15)లను మార్‌క్రమ్ ఔట్ చేశారు. రాహుల్(57), అక్షర్ పటేల్(34) చివరి వరకు ఆడడంతో ఢిల్లీ.. 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మూడో వికెట్‌కు 56 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో మార్‌క్రమ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికల రెండో స్థానంలో ఉండగా.. లక్నో 5వ స్థానంలో కొనసాగుతోంది.