Published On:

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో మాజీ ఛాంపియ‌న్ల పోరు అల‌రించ‌నుంది. ఐదు టైటిళ్ల‌తో చరిత్ర సృష్టించిన ముంబయి ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్లు త‌ల‌ప‌డున్నాయి. వాంఖ‌డే వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.

 

కీల‌కమైన మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌ జ‌ట్టుకు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌ను ప‌క్క‌న పెట్టగా, యువ‌ కెర‌టం ఆయుశ్ మాత్రేను తుది జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబయి జట్టు 7 స్థానంలో ఉండగా, చెన్నై పదో స్థాయిలో ఉంది.

 

ముంబయి జట్టు : రికెల్టన్, జాక్స్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, నమన్, శాంట్నర్, దీపక్, బౌల్ట్, బుమ్రా, అశ్వనీ ఉన్నారు.

చెన్నై జట్టు : షేక్ రషీద్, రచిన్, ఆయున్, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఓవర్టన్, ఎంఎస్ ధోనీ, నూర్ అహ్మద్, ఖలీల్, పతిరణ ఉన్నారు.

 

 

ఇవి కూడా చదవండి: