Published On:

IPL 2025 39th Match: నేడు మరో ఆసక్తికర మ్యాచ్.. గుజరాత్‌తో కోల్‌కతా ఢీ

IPL 2025 39th Match: నేడు మరో ఆసక్తికర మ్యాచ్.. గుజరాత్‌తో కోల్‌కతా ఢీ

Kolkata Knight Riders vs Gujarat Titans IPL 2025 39th Match: ఐపీఎల్ 2025లో 18వ సీజన్‌ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు గుజరాత్ 7 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాపర్‌ ప్లేసులో ఉంది. ఇక, కోల్‌కతా జట్టు 7 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 3 మ్యాచ్‌ల్లో నెగ్గి 4 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.

 

అయితే కోల్‌కతా జట్టు ప్లేఆప్స్ వెళ్లాలంటే గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు విజయం సాధించాలి. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా.. గుజరాత్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కోల్‌కతా ఒక్క మ్యాచ్‌లో గెలుపొందగా.. ఒక్క మ్యాచ్ రద్దయింది.

ఇవి కూడా చదవండి: