Published On:

IPL2025: ఢిల్లీ ముంగిట భారీ లక్ష్యం.. ఎవరిదో విజయం

IPL2025: ఢిల్లీ ముంగిట భారీ లక్ష్యం.. ఎవరిదో విజయం

DC Vs KKR: ఐపీఎల్ సీజన్ 18 లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య పోరు జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది.

ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది. కోల్ కతా ఓపెనర్లు రహ్మనుల్లా గర్భాజ్, సునీల్ నరైన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. మొత్తానికి తొలి ఆరు ఓవర్లు ముగిసే వరకు కోల్ కతా 79 పరుగులు చేసింది. కానీ పవర్ ప్లే అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయింది. అంగ్క్రిష్ రఘువంశీ 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. నరైన్ (27), రహానే (26) చేసి ఔటయ్యారు. చివర్లో రింకూ సింగ్ (36) దూకుడుగా ఆడటంతో జట్టు 200 మార్క్ ను దాటింది.

ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, తలో రెండు వికెట్లు పడగొట్టారు. చమీరాకు వికెట్ దక్కింది.

ఇవి కూడా చదవండి: