Published On:

IPL 2025 : టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్

IPL 2025 : టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా మరికాసేపట్లలో ఉప్పల్ మైదానంలో ఎస్‌ఆర్‌హెచ్, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరుగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. పహల్గాం ఉగ్రదాడికి నివాళిగా రెండు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జిలతో బరిలోకి దిగనున్నారు. చీర్ లీడర్స్‌కు అనుమతి లేదు.

 

18వ సీజన్‌లో రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. ఈ నెల 17వ తేదీన తమ సొంతమైదానంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ సన్‌రైజర్స్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఈ కీలక మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు తప్పక గెలవాలి. ఈ కీలక మ్యాచ్‌లో ఓడితే హైదరాబాద్ లీగ్‌ నుంచి నిష్క్రమించినట్లే. ఈ కీలక మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్‌కు కూడా కీలకమే.

 

ముంబయి ఇండియన్స్ కూడా ఈ కీలక మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబయి ఇండియన్స్ ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి 6 స్థానంలో కొనసాగుతుంది.

 

నేటి మ్యాచ్‌ హైదరాబాద్ జట్టు తమ సొంత గడ్డంపై ఆడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. తమ విధ్వంసకర ఆటగాళ్లు ఈ కీలక మ్యాచ్‌లో చెలరేగుతారని ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు ఆశిస్తున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌కు సొంతమైదానంలో మంచి రికార్డు ఉంది. గతంలో ఇక్కడ ఆడిన మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు చెలరేగారు. నేటి ​మ్యాచ్‌లో అదే జోరు కొనసాగిస్తారో లేదో వేచి చూడాలి.

 

తుది జట్లు అంచనా..

ఎస్ఆర్‌హెచ్ జట్టు : అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్‌రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఎషాన్ మలింగ ఉన్నారు.

ముంబయి జట్టు : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్ ఉన్నారు.

 

 

ఇవి కూడా చదవండి: