Last Updated:

Komati Reddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారెటు?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉంటున్న ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.

Komati Reddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారెటు?

Munugode by poll: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉంటున్న ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. తన తమ్ముడు బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దుతు ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్లు చేసి విజ్ఞప్తులు చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల జబ్బర్ అనే ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి, సోదరుడు రాజగోపాల్ రెడ్డికి అన్ని విధాలుగా ఆదుకోవాని పార్టీలకు అతీతంగా మద్దుతు ఇవ్వాలని కోరిన వాయిస్ రికార్డ్ మీడియాలో వైరల్ అయింది. కోమటిరెడ్డి వాయిస్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్య కమిటీ దృష్టికి వెళ్లింది. దీంతో ఏఐసీసీ సెక్రెటరీ తారీఖ్ అన్వర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మీ వైఖరి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. పది రోజుల్లోగా మీ మీద ఎందుకు చర్య తీసికొరాదో వివరణ ఇవ్వండి.” అంటూ ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో తనను కలిసిన అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని, తాను ప్రచారం చేసినా, లాభం లేదని కేవలం 10 వేల ఓట్లకు మించి రావని అన్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని వివరణ కోరింది. అయితే, ఈ నోటీసులకు వెంకటరెడ్డి ఎలాంటి సమాధానం చెబుతారనేది ఆసక్తిగా మారితే, మరోవైపు రేవంత్ రెడ్డి వర్గంగా ఉన్న కొందరు నాయకులు మాత్రం వెంకటరెడ్డి పై వేటు వేయాలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసే అవకాశం మెండుగా ఉందనే గుసగుస పార్టీలోనే వినిపిస్తుండడం గమనార్హం. మరి పార్టీ ఏం చేస్తుందో చూడాలి. కానీ, షోకాజ్ నోటీసును ఎంపీ లెక్కచేస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఏదో ఇవ్వాలి కాబట్టి ఎంపీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు ఇచ్చినట్లుంది. తాము షోకాజ్ నోటీసు ఇచ్చినా దానికి ఎంపీ సమాధానం ఇస్తారనే ఆశలైతే అధిష్టానంలో ఉన్నట్లు లేదు. ఎందుకంటే అవసరమైతే తాను రిటైర్ అయిపోతానని చెప్పి మరీ కాంగ్రెస్ ను డ్యామేజింగా మాట్లాడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి అధిష్టానం మాత్రం ఏమి సమాధానం ఆశిస్తుంది. అయితే, ఎంపీకి రిటైరయ్యే ఉద్దేశ్యంలేదట. మునుగోడు ఉపఎన్నికల రిజల్టు చూసుకుని అప్పుడు ఏమిచేయాలో నిర్ణయించుకుంటారట. మునుగోడులో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న తమ్ముడు గెలిస్తే ఎంపీ కూడా కమలంపార్టీలో చేరిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్‌ వినిపిస్తోది. ఒకవేళ తమ్ముడు ఓడిపోతే ఏమిచేయాలో అప్పుడే నిర్ణయించుకుంటారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

ఒకవేళ, ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోయినా జనరల్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎంపీ అనుకుంటే బీజేపీలో వెళ్ళే ఛాన్స్ ఉందనే అనుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది అనుమానమే అని భావిస్తున్నారు. ఇపుడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా రేపటి జనరల్ ఎలక్షన్స్ లో గెలుస్తుందని గ్యారెంటీ లేదు. కాబట్టి తమ వ్యాపారాలు సజావుగా సాగాలంటే తాను కూడా బీజేపీలోకి వెళ్ళటమే బెటర్ అని ఆలోచిస్తుండచ్చు. ఏదేమైనా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తిరిగొచ్చిన తర్వాత కానీ ఈ విషయంలో క్లారిటిరాదు.

 

ఇవి కూడా చదవండి: