Last Updated:

Ambati Rambabu: నువ్వు పెద్ద మగోడివా? పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు ఫైర్

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పై మరోసారి మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో.. లేదా జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని ఆయన సూచించారు.

Ambati Rambabu: నువ్వు పెద్ద మగోడివా? పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు ఫైర్

Ambati Rambabu: ప్రస్తుతం ప్రతిపక్షాలు పిచ్చ ఫాంలో దూసుకుపోతున్నాయి. ఓ వైపు తెదేపా మరోవైపు జనసేన పార్టీ నేతలు ప్రజా మద్ధతును ఏర్పరచుకునేందుకు సభలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటికి ప్రజల నుంచి విశేష స్పందన లభింస్తోందనే చెప్పాలి. వాటిని తిప్పికొట్టేందుకు అధికార వైసీపీ సైతం వివిధ కార్యక్రమాలు ప్రెస్ మీట్లతో నిత్యం ప్రజల మధ్యే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పై మరోసారి మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో.. లేదా జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని ఆయన సూచించారు.

బుద్ధి.. జ్ఞానం లేని పవన్‌కళ్యాణ్‌కు రాజకీయాలు ఏం తెలుసంటూ ఆయన విమర్శించారు.  ముందు ఆయన అధికారంలోకి వస్తారో రారో చెప్పరు కానీ వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వను అంటారు.. ఓట్లు చీలనివ్వను అంటాడు.. అంత పెద్ద మగాడా పవన్ అంటూ అంబటి సంచల కామెంట్లు చేశారు.  కాపులంతా మా పవన్.. మా పవన్ అంటూ గోక్కుంటున్నారు. గోక్కుని.. గోక్కుని చంద్రబాబు దగ్గర పవన్‌తో కలిసి గొడ్డుచాకిరి చేయండి అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఒక్కచోట కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ నాపై ఆరోపణలు చేస్తాడా? అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ambati Rambabu

Ambati Rambabu

వైసీపీలో తాను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించరు.. అందుకే తనను టార్గెట్‌ చేసుకొని పవన్, చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. నేను ప్రజలకు ఎంతసేవ చేశానో ప్రజలకు తెలుసు.. అలాంటి నన్ను శవాలు మీద పేలాలు ఏరుకునే వాడంటారా నేను ఒక్కపైసా అయినా ఆశించానా? అయినా కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తాడా..? అంటూ పవన్‌కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయి మాట్లాడారు. మరి అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేనాని, జనసైనికులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇదీ చదవండి: బావ కోసమే బావమరిది షోకి పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై పేర్నినాని కామెంట్స్

ఇవి కూడా చదవండి: