Andhra Pradesh News: అభివృద్ధిని అడ్డుకుంటే ఖబర్దార్.. వైసీపీకి ఎంపీ కేశినేని చిన్ని వార్నింగ్!

Andhra Pradesh MP Kesineni Chinni Sensational Comments on Jagan: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్‌ఆర్‌ఐలు వస్తున్నారని, వాళ్ల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. విదేశీ కంపెనీల విషయంలో వైసీపీ విషం చిమ్ముతుందని ఆరోపించారు.
రాష్ట్రానికి గత 9 నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో 21 సూట్ కేసు కంపెనీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు విమర్శలు చేయడం మంచిది కాదని, అభివృద్ధిని అడ్డుకుంటానంటే చూస్తూ ఊరుకోమని ఎంపీ వార్నింగ్ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయన్నారు. ఈ పెట్టుబడులపై దుష్ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. లిక్కర్ స్కాం కేసును దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే అసత్య ప్రచారాలకు తెర లేపారని మండిపడ్డారు.