India Pakistan War: నేడు పాక్ తో భారత్ కీలక చర్చలు..!

India Pakistan Key Meeting today on War: ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంవోలు హాట్ లైన్ లో మాట్లాడుకోబోతున్నారు. కాల్పుల విరమణ, అనంతర పరిస్థితులపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. కాల్పుల విరమణ, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై చర్చించనున్నారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది పాకిస్తాన్. ఈ నిబంధనల ఉల్లంఘనలపై పాక్ ను భారత్ ప్రశ్నించనుంది . సింధు జలాలు, ఉగ్రవాదుల అప్పగింత వంటి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.
కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చినా.. పాక్ మళ్లీ రాత్రి డ్రోన్లతో దాడులకు పాల్పడిందని ఆర్మీ ప్రకటించింది. మరోసారి పాక్ దాడులు కొనసాగితే తీవ్రమైన ప్రతి చర్యలు ఉంటాయని భారత్ వార్నింగ్ ఇచ్చింది. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చర్యకైనా పాక్ కు తగిన జవాబిస్తామని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది.
పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారంగానే ఆ దేశ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసినట్లు DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ప్రకటించారు. మే 7-10వ తేదీల మధ్య ఎదురుకాల్పుల్లో 35-40 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆ దేశ ఆర్మీ ప్రకటించిందన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడం తప్ప భారత్ కు మరో మార్గం లేదని డీజీఎంవో స్పష్టం చేశారు. ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని డీజీఎంవో రాజీవ్ తెలిపారు. భారత్ చేసిన మెరుపు దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారని భారత్ ప్రకటించింది.