Published On:

Rajnath Singh: పాక్ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా: రాజ్ నాథ్

Rajnath Singh: పాక్ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా: రాజ్ నాథ్

Rajnath Singh: అణ్వాయుధాలను రక్షించుకోలేని దేశంగా పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. నేడు ఆయన జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఆయనకు ఉపేంద్ర ద్వివేదీ స్వాగతం పలికారు. అణ్వాయుధాలను బాధ్యతారాహిత్యంగా పాకిస్తాన్ ఉంచిందన్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పాక్ నుంచి అణ్వాయుధాలు తీసుకుని భద్రపరచాలన్నారు. కాశ్మీర్ లో పర్యటిస్తున్న ఆయన… ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారి అంతంచూస్తామన్నారు. టెర్రరిస్టులతో పోరాడి అమరులైన జవాన్లకు శిరసువంచి నమస్కరిస్తున్నామన్నారు.

 

ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరుకాదని ఒక కమిట్మెంట్ అని అన్నారు. ఇకపై ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా దాన్ని యుద్ధంగానే పరిగనిస్తామన్నారు. త్రివిద దళాల వీరోచిత పోరాటాన్ని ప్రపంచం చూసిందన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి ఆయన నివాళులర్పించారు. పాకిస్తాన్ షెల్లింగ్ జరిపిన ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఇందులో భాగంగానే చినార్ కోర్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించి వాయుసేనతో కలువనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాజ్ నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఆర్మీ చీఫ్ ద్వివేది చినార్ కోర్ డివిజన్ లోని అన్ని ర్యాంకుల అధికారుతో సమావేశమయ్యారు.