Ajith About Racing: హీరో అజిత్ కీలక నిర్ణయం – సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా..

Ajith Kumar Said He Take Break From Movies: తమిళ స్టార్ హీరో అజిత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేసింగ్, సినిమా.. రెండింటికి సరైన న్యాయం చేయలేకపోతున్నా అన్నారు. అందుకే సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అజిత్ రేసింగ్, సినిమాలపై స్పందించారు. కాగా అజిత్ హీరో కాకుముందే నుంచి రేసింగ్‌పై ఆసక్తి ఎక్కువ. రేసింగ్ కోసమే ఆయన సినిమాల్లోకి వచ్చానని ఇటీవల చెప్పారు.
దీంతో ఇటూ సినిమాలు, అటూ రేసింగ్ ఇంతకాలం బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు రెండింటిని మ్యానేజ్ చేసుకోలేకపోతున్నానని చెప్పారు. “రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. రేసింగ్‌కు ఫిట్‌నెస్ ఎంతో అసవరం. చాలా రోజలు తర్వాత రేస్‌పై ద్రష్టి పెట్టినప్పుడు ముందు శారీరకంగా మారాలని అర్థమైంది. దీంతో ఫిట్‌నెస్‌పై ద్రష్టి పెట్టాను. స్విమ్మింగ్, సైక్లింగ్‌తో పాటు ఇతర వర్కౌట్లు, డైట్ చేస్తున్నారు. ఈక్రమంలో ఎనిమిది నెలల్లో నేను 42 కిలోల బరువు తగ్గాను.
రేసింగ్, సినిమా ఒకే టైంలో ఉంటే ఆ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నా. దానివల్ల ఎన్నో ఒడిదుడుగులు చూడాల్సి వస్తుంది. అందుకే రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా” అని అంటూ చెప్పుకొచ్చారు. ‘అనంతరం రేసింగ్‌లో వరుస ప్రమాదాలపై ఆయన స్పందించారు. రేసింగ్ టైంలో ఎన్నోసార్లు ప్రమాదాల బారిన పడ్డాను.
నిజానికి నా సినిమాల్లో డూప్ లేకుండ నేనే స్టంట్స్ సీన్లలో నటిస్తాను. ఆ సమయంలో ఎన్నోసార్లు గాయాలయ్యాయి. ఎన్నో సర్జరీలు జరిగాయి. అలా సినిమాలు మానేయలేం కదా. అలాగే రేసింగ్ కూడా అంతే. ప్రమాదాలు జరిగాయని రేసింగ్‌ని పక్కన పెట్టలేను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా ఇటీవల అజిత్ పద్మ భూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
- NTRNeel: ఇది ‘వార్ 2’ టైమ్ – మా మిస్సైల్ తర్వాత వస్తుంది – ఎన్టీఆర్‌నీల్ మేకర్స్ షాకింగ్ ట్వీట్