Pakistanis : పాకిస్థానీయులకు బిగ్ రిలీఫ్.. గడువు పొడిగించిన కేంద్రం

Center extends deadline for Pakistanis : జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య సత్ససంబంధాలు తెగదెంపులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జాతీయులు భారత్‌ను వీడి వెళ్లేందుకు గడువు విధించింది. అయితే భారత్ జారీ చేసిన ఉత్తర్వుల్లో తాజాగా సవరించినట్లు తెలుస్తోంది.
ఉత్తర్వులు సవరణ..
పాకిస్థాన్ జాతీయులు భారత్ నుంచి తిరిగి వెళ్లడానికి గడువు ఇవ్వగా, ఈ గడువు మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన వాఘా-అటారీ సరిహద్దును మూసివేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇచ్చిన ఉత్తర్వును సవరించినట్లు సమాచారం. ఆంక్షలు సడలించారు. దీంతో తదుపరి ఆదేశాలు వెలువడేవరకు పాక్ జాతీయలు ఆ సరిహద్దు నుంచి స్వదేశానికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వెళ్లిపోయిన వారిలో 786 మంది పాక్ జాతీయులు..
జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా భారత్‌ను వీడి వెళ్లాలని పాకిస్థాన్ జాతీయులను కేంద్రం ఆదేశించగా, బుధవారం 786 మంది వెళ్లిపోయారు. 55 మంది దౌత్యాధికారులు, డిపెండెంట్లు, సహాయక సిబ్బంది, 8 మంది పాక్ వీసాలు ఉన్న భారతీయులు ఉన్నారు. ఆరు రోజుల్లో వారు అటారీ-వాఘా సరిహద్దు మీదుగా పాక్‌కు వెళ్లిపోయారు. పాక్ నుంచి భారత్‌కు 1,465 మంది వచ్చారు. వారిలో 25 మంది దౌత్యాధికారులు ఉండగా, అధికారులు, దీర్ఘకాల వీసాలున్న 151 మంది పాకిస్థాన్ జాతీయులు ఉన్నారు.