Published On:

Southwest Monsoon : చల్లని కబురు.. అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon : చల్లని కబురు.. అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon : గ్రీష్మం రుతువుతో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి చల్లని కబరు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతం ఇచ్చే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా రెండు రోజులుగా నికోబార్‌ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

 

రానున్న మూడు, నాలుగు రోజుల్లో..
రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులవులతోపాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది.

 

సాధారణంగా జూన్‌ 1 నాటికి రుతుపవనాలు..
సాధారణంగా జూన్‌ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం ముందుగానే వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే 2009 ఏడాది తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం మళ్లీ ఇప్పుడే అవుతుంది. ఆ సంవత్సరం మే 23న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి: