Published On:

Indian Navy in Arabian Sea: మిసైల్ టెస్ట్ సక్సెస్.. పాక్‌తో యుద్దానికి సిద్ధమైన భారత్..!

Indian Navy in Arabian Sea: మిసైల్ టెస్ట్ సక్సెస్.. పాక్‌తో యుద్దానికి సిద్ధమైన భారత్..!

Indian Navy successfully Tested fires missile INS Surat: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోగా.. పాక్ కవ్వింపుల చర్యలకు పాల్పడుతోంది. ఇరు దేశాలు వీసాల రద్దు వంటి ఆంక్షలను పోటాపోటీగా విధించుకుంటున్నాయి. అలాగే దేశ సరిహద్దుల్లో సైన్యం తరలిస్తుంది. తాజాగా, మిస్సైళ్ల ప్రయోగం అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొల్పింది.

 

ఇండియన్ నేవీ స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్‌ను టెస్ట్ చేసింది. ఈ మిస్సైల్ టెస్ట్ సక్సెస్ అయింది. సముద్ర ఉపరితలం నుంచి ప్రయోగించగా.. తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాన్ని అడ్డుకుందని ఇండియన్ నేవీ తెలిపింది. ఇది దేశం రక్షణ సామర్థ్యాలలో మరో మైలురాయి అని పేర్కొంది. ఈ ఉగ్రదాడి అనంతరం ప్రయోగించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

అంతేకాకుండా, ఇవాళ లేదా రేపు కరాచీ తీరం నుంచి ఉపరితలం నుంచి ఉపరితలం వరకు క్షిపణి పరీక్షించనున్నట్లు పాక్ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్.. తన మిస్సైల్ టెస్ట్ ఫైర్ జరగడం గమనార్హం. తాజాగా, ఈ టెస్ట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 

మరోవైపు, పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించడంతో పాకిస్థాన్ అప్రమత్తమైందని సమాచారం. భారత్ దాడి చేస్తే తప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని పాక్ తన సైనికులకు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సైనికులకు సెలవులు సైతం రద్దు చేసింది. అలాగే సెలవుల్లో ఉన్న వారు సైతం తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఎయిర్ అటాక్స్ భయంతో భారత విమానాలకు తమ గగనతలం నుంచి ప్రయాణించేందుకు అనుమతి సైతం లేదని స్పష్టం చేసింది.