Published On:

BSF Jawan Arrested: ముదురుతున్న భారత్, పాక్ వివాదం.. సరిహద్దుల్లో భారత్ జవాన్‌ను బంధించిన పాకిస్థాన్!

BSF Jawan Arrested: ముదురుతున్న భారత్, పాక్ వివాదం.. సరిహద్దుల్లో భారత్ జవాన్‌ను బంధించిన పాకిస్థాన్!

BSF Jawan Arrested by Pakistan Rangers Mobile: భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం ముదురుతోంది. పాకిస్థాన్ బందీగా భారత్ జవాన్‌ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్‌ను పాకిస్థాన్ బంధించింది. తమ భూభాగంలోకి ప్రవేశించాడని పాకిస్థాన్ ఆరోపిస్తుంది. అయితే అక్రమంగా బంధించారని భారత్ చెబుతోంది.

 

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను పాక్ బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడంతో అరెస్ట్ చేసినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది. అయితే ఈ ఆరోఫణలను బీఎస్ఎఫ్ ఖండించింది. జవాన్ అనుకోకుండా జీరో లైన్ దాటడంతో.. కావాలనే పాక్ ఆర్మీ తప్పుడు ఆరోపణలతో జవాన్‌ను అదుపులోకి తీసుకుందని భారత్ ఆర్మీ వివరించింది.

 

వివరాల ప్రకారం.. ఫిరోజ్‌పూర్‌లో రైతులు పంటలు కోస్తున్నారు. ఈ సమయంలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ భద్రత కోసం ఉన్నాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓ జవాన్ నీడ కోసం జీరో లైన్ దాటి అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు. ఈ సమయంలో పాకిస్థాన్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆతడి ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

ఇదిలా ఉండగా, రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో కలిసే భూభాగాన్ని జీరో లైన్ అని పిలుస్తారు. ఈ భూభాగంలో వ్యవసాయం చేసేందుకు రైతులకు ప్రత్యేక అనుమతి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఆ ప్రాంతంలో పంట కోస్తున్న సమయంలో కొంతమంది బీఎస్ఎఫ్ జవాన్లు రక్షణగా ఉంటారు. వీరిని రైతు రక్షకులు అని కూడా పిలుస్తుంటారు.

 

ఈ జీరో లైన్ వద్ద ముళ్ల తీగ ఉంటుంది. ఆ ముళ్ల తీగలను జీరో లైన్ కు సమీపంలో ఏర్పాటు చేస్తారు. కానీ జీరో లైన్ వద్ద మాత్రం కేవలం స్తంభాలను మాత్రమే ఉంటాయి. ఈ సమయంలో అక్కడ ఉన్న ఓ జవాన్‌కు వేడి ఎక్కువగా అనిపించడంతో జీరో లైన్ దాటి పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఓ చెట్టు కిందకు వెళ్లాడు. ఈ సమయంలోనే పాక్.. ఆయనను బందీగా తీసుకెళ్లింది.

 

మరోవైపు, ఈ దాడి నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్‌లు కలిశారు. పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ చర్యలను మంత్రులు వివరించారు. అలాగే దేశ భద్రత, పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలపై కీలకంగా చర్చింనున్నారు.