Published On:

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై పాకిస్తాన్ ప్రధానిని ప్రశ్నించిన క్రికెటర్!

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై పాకిస్తాన్ ప్రధానిని ప్రశ్నించిన క్రికెటర్!
  • తప్పు లేకపోతే ఎందుకు ఖండించలేదు
  • భారత్ లో దాడి జరిగితే పాక్ ఆర్మీ ఎందుకు అప్రమత్తమైంది
  • ఉగ్రవాదులను కావాలనే దాస్తున్నారా, తయారు చేస్తున్నారా..?

 

EX Pakistani Cricketer Danish Kaneria Slams Pakistan PM over Pahalgam Terror Attack: గంజాయి వనంలో తులసి మొక్కలా ప్రవర్తించాడు పాకిస్తాని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. భారతదేశంలో జరిగిన ఉగ్రదాడిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. పహల్గాంలో జరిగిన దాడిపై తన దేశ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించాడు. ప్రపంచ దేశాల వేళ్లు పాకిస్తాన్ ను చూపెడుతుంటే దాడిపై ఎందుకు మౌనం వహించారన్నారు.

 

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో తీవ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరపడంతో 26 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ప్రపంచదేశాలు ఖండించి భారత్ కు మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ తో కలిసి వస్తామని హామీ ఇచ్చాయి. అయితే పాక్ పీఎం మాత్రం స్పందించలేదని కనేరియా ప్రశ్నించాడు.

 

భారత్ లో జరిగిన దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేకపోతే ఎందుకు ఖండించలేదన్నారు. అందుకుగాను ఎక్స్ లో పోస్ట్ చేశారు. “బారత్ లో జరిగిన దాడికి పాక్ కు సంబంధం లేకపోతే ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మీరు ఏదో దాస్తున్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. వారిని పెంచుతున్నారు. సిగ్గుచేటు” అని కనేరియా ఎక్స్ వేదికగా విమర్శించారు.

 

ఉగ్రదాడిపై భారతదేశం అంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అనేకమంది క్రీడాకారులు సానుభూతిని తెలియజేశారు. ఐపీఎల్ మ్యచ్ కు ముందు హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ప్లేయర్లతో పాటు, ఎంపైర్లు నల్ల బ్యాడ్జ్ ధరించి నివాళులు అర్పించారు. బీసీసీఐ సంతాపం తెలియజేసింది. చీర్ లీడర్లు లేరు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ పాండ్యా సంతాపాన్ని వ్యక్తం చేశాడు. హైదరాబాద్ కెప్టెన్ కమ్మిన్స్ మాట్లాడుతూ ఇది తమకు చాలా బాధను కలుగజేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు.