Pahalgam: మమ్మల్ని విడదీయకండి.. భారత్ లోనే ఉంటా: సీమా హైదరీ

Pahalgam Effect: నేను ఇప్పుడు పాకిస్థానీ కూతురిని కాదని భారతదేశపు కోడలినని అంటుంది సీమా హైదర్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పౌరులను తిరిగి పంపించేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్థాన్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. దీంతో సీమా బహిష్కరకు గురవుతానని ఆందోళన చెందుతుంది.
2023లో యూపీకి చెందిన తన ప్రియుడు సచిన్ మీనాను వివాహం చేసుకోడానికి పాకిస్థాన్ నుండి నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది. ప్రస్తుతం ఆవిడ సచిన్ ను వివాహం చేసుకుంది. వారు కుమార్తెకు జన్మనిచ్చారు.
ప్రధాని మోదీకి సీమా హైదరీ విజ్ఞప్తి చేసిన వీడియో వైరల్ అయింది. తాను ఒకప్పుడు పాకిస్థాన్ కూతురునని ఇప్పుడు భారతదేశ కోడలినని, తిరిగి పాకిస్థాన్ వెళ్లాలనుకోవడం లేదని చెప్పింది. ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ సీమా పాకిస్థాన్ జాతీయురాలు కాదని చెప్పారు. ఆమె ఇప్పుడు భారతీయ భర్తను కలిగిఉందని వారు ఒక కూతురికి కూడా జన్మనిచ్చారని, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు ఆమెకు వర్తించవని తెలిపారు.
సీమా హైదర్ 2023 మేలో కరాచీలోని తన ఇంటిని విడిచిపెట్టి పిల్లలతో సహా భారత్ కు వచ్చారు. ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని రబుపుర ప్రాంతంలో నివసిస్తున్న సచిన్ మీనాకు ఇంటర్నెట్ లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లిచేసుకోవాలనుకున్నారు. దీంతో సీమా పాకిస్థాన్ ను వదిలి భారత్ కు అక్రమంగా చేరింది. ఆపై వీరికి పెళ్లి జరుగగా తాజాగా పాపకు జన్మనిచ్చారు.
పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ సంబంధాలు దారునంగా పతనమయ్యాయి. దాడికి ప్రతీకారంగా భారత్ సింధూ జలాలను నిలిపివేయడంతో పాటు, పాకిస్థాన్ పౌరులను తిరిగి వారి దేశానికి వెళ్లాలని ఆదేశించింది. వీసాలను నిలిపివేసింది. టూరిస్ట్ వీసాలు ఏప్రిల్ 27నుండి రద్దు చేయబడతాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. మెడికల్ వీసాలు ఏప్రిల్ 29వరకు చెల్లుబాలు అవుతాయి. ఈ లోపు భారత్ విడివెళ్లాలని కేంద్రం ఆదేశించింది.