Published On:

Operation Sindoor: భారత్ భీకర దాడి, ఉగ్రవాదులు హతం

Operation Sindoor: భారత్ భీకర దాడి, ఉగ్రవాదులు హతం

Most Wanted Terrorist killed in Operation Sindoor: భారత్ దాడుల్లో ఐదగురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు. ముగ్గురు జైషే అహ్మద్, ఇద్దరు లష్కర్ ఎ తోయిబా టెర్రరిస్ట్‌లను భారత్ మట్టుబెట్టింది. లష్కర్ ఎ తోయిబాకు చెందిన మురుడ్కే మర్కజ్ ఇన్ చార్జ్ ముడస్సర్ ఖైదాన్, ఖలీద్‌లను భారత ఆర్మీ మట్టుబెట్టింది. జైష్ ఎ మహ్మద్‌కు చెందిన హఫీజ్ మహ్మద్ జమీల్, మహ్మద్ యూసఫ్ అజార్, మహ్మ్ అసన్ ఖాన్ హతమయ్యారు. పాకిస్తాన్‌లోని టెర్రరిస్ట్ స్థావరాలపై జరిపిన దాడుల్లో ఈ ఐదుగురు టాప్ టెర్రరిస్ట్‌లు మృతిచెందారు.

 

భారత్‭ను పాక్ మరింత రెచ్చగొడుతోంది. ఉరి ప్రాంతంపై పాక్ వరుస దాడులు చేస్తుంది. దీంతో LOC దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల వెంబడి పాక్ బలగాలను పెంచుతుంది. ఇప్పటికే దీర్ఘశ్రేణి క్షిపణలను పాక్ ప్రయోగిస్తుంది. మరోవైపు పాక్‭కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ చెబుతుంది.

 

శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జనావాసాలు టార్గెట్‌గా పేలుళ్లు జరుగుతున్నాయి. ప్రజలను భారత్ ఆర్మీ అప్రమత్తం చేస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. భింబర్ నుంచి భారీ ఆర్టిలరీ కాల్పులు వినిపిస్తున్నాయి. పాక్ సైన్యం కాల్పులను భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి. టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్‌ను ఇండియన్ ఆర్మీ పేల్చేసింది.

 

ప్రధాని మోడీ మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్‌నాథ్‌సింగ్, అజిత్ దోవల్, సీడీఎస్ అనిత్ చౌహాన్,

 

త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్, సరిహద్దు పరిస్థితులు, త్రివిధ దళాల సన్నద్ధత, కార్యాచరణపై చర్చించనున్నారు. పాక్ సైనిక బలగాల మోహరింపు, డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధ విమానాలతో దాడులపై మోడీకి వివరించనున్నారు.

 

ఇవి కూడా చదవండి: