Published On:

OnePlus 13s Launching: మాములుగా ఉండదు.. ప్లస్ కీ ఫీచర్‌తో వన్‌ప్లస్ 13 ఎస్.. ఇవిగో ఫుల్ డీటెయిల్స్..!

OnePlus 13s Launching: మాములుగా ఉండదు.. ప్లస్ కీ ఫీచర్‌తో వన్‌ప్లస్ 13 ఎస్.. ఇవిగో ఫుల్ డీటెయిల్స్..!

OnePlus 13s Launching Soon with Compact Features: వన్‌ప్లస్ 13s త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే, కంపెనీ వన్‌ప్లస్ ఈ కాంపాక్ట్ ఫోన్ ఫీచర్లను టీజ్ చేసింది. ఈ చైనీస్ బ్రాండ్ ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 13T రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. ఈ ఫోన్‌లో ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుంది. అలాగే, ఇందులో ఐఫోన్ 16 లాగా ప్రత్యేకమైన ఫంక్షన్ బటన్‌ కూడా ఉంటుంది.

 

ఈ రాబోయే ఫోన్‌లో ప్లస్ కీ ఉంటుందని వన్‌ప్లస్ ఇండియా తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ధృవీకరించింది. ఈ ప్లస్ కీ టీజర్ వీడియో సోషల్ మీడియా హ్యాండిల్ నుండి పోస్ట్ చేశారు. అలాగే, వన్‌ప్లస్ 13 లాగా, దీనికి అలర్ట్ స్లయిడర్ ఉండదు. కంపెనీ తన రాబోయే మోడల్ నుండి ఈ హెచ్చరిక స్లయిడర్ బటన్‌ను తొలగించింది.

OnePlus 13s Features

చైనాలో లాంచ్ అయిన OnePlus 13T లాగానే, ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 6.32-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది, ఇది 120Hz అధిక రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. OnePlus 13T లాగా, ఈ ఫోన్ లోహపు ఫ్రేమ్ కలిగి ఉంటుంది.

 

ఈ ఫోన్ వన్‌న్లస్ 13 లాగా క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్‌కి సపోర్ట్ ఇవ్వగలదు. ఇది 16జీబీ ర్యామ్,1TB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద 4400mm2 గ్లేసియర్ వేపర్ చాంబర్ (VC) కూలింగ్ తో రావచ్చు, ఇది ఫోన్ వేడెక్కకుండా నిరోధిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS 15 పై పని చేస్తుంది.

 

వన్‌ప్లస్ 13T వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 50MP మెయిన్ OIS కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. ఫోన్ వెనుక కెమెరా 2x ఆప్టికల్ జూమ్, 20x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ ఇవ్వగలదు. సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 16MP కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP65 రేటింగ్, Wi-Fi7, బ్లూటూత్ 5.4, GPS, NFC వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో పాటు 6,260mAh బ్యాటరీని అందించవచ్చు.