Last Updated:

CM Yogi: గోరఖ్‌పూర్ జూలో చిరుతపులి పిల్లకి పాలుపట్టిన సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అష్ఫాఖుల్లా ఖాన్ జూలాజికల్ పార్క్‌లో చిరుత పిల్లకు పాలు తాగించారు.

CM Yogi: గోరఖ్‌పూర్ జూలో చిరుతపులి పిల్లకి పాలుపట్టిన  సీఎం యోగి ఆదిత్యనాథ్

CM Yogi:  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అష్ఫాఖుల్లా ఖాన్ జూలాజికల్ పార్క్‌లో చిరుత పిల్లకు పాలు తాగించారు. తొలుత పాలు తాగేందుకు చిరుత సంశయించింది. ఆ తర్వాత దానిని తన ఒళ్లోకి తీసుకుని మళ్లీ పాలు తాగించేందుకు ప్రయత్నించగా ఈసారి అది పాలను తాగేసింది. అనంతరం సీఎం జూ అంత దిరిగారు. పులులను ఉంచిన ఎన్‌క్లోజర్ల వద్దకు వెళ్లారు. ఎన్‌క్లోజర్లకు సంబంధించిన విషయాలు, పులుల నిర్వహణకు సంభందించినవి జూ అధికారులు సీఎంకు వివరించారు. పులి పిల్లకు పాలు తాగిస్తున్న సీఎం వీడియోను ప్రభుత్వం తన అధికారిక యూట్యూబ్ చానల్‌లో పోస్టు చేసింది.

రెండు చిరుత పులులకు సీఎం చండీ, భవానీ అని నామకరణం చేశారు. రెండున్నర నెలల క్రితం గోరఖ్‌పూర్ జంతుప్రదర్శనశాలకు తీసుకొచ్చిన తెల్లపులి గీతను కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రధాన ఎన్‌క్లోజర్‌లోకి తీసుకెళ్లారు.సభను ఉద్దేశించి సీఎం యోగి వన్యప్రాణుల రక్షణపై ఉద్ఘాటించారు. అటవీ శాఖ పరిధిలో వన్యప్రాణులకు సరైన సంరక్షణ మరియు చికిత్స అందించడానికి వెటర్నరీ డాక్టర్ల ప్రత్యేక కేడర్ అవసరమని ఆయన నొక్కి చెప్పారు. జిల్లా వెటర్నరీ ఆసుపత్రుల్లో (వన్యప్రాణుల సంరక్షణ కూడా తీసుకునేవారు) నియమించిన వెటర్నరీ వైద్యులు అనుభవం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కాన్పూర్‌లో నమామి గంగే ప్రాజెక్టు స్థిరమైన ఫలితాలను సాధించిందని, క్లీనర్ గంగ కారణంగా కాన్పూర్‌లో జలచరాలు పునరుద్ధరించబడ్డాయని ముఖ్యమంత్రి యోగి పేర్కొన్నారు. తాను ప్రయాగ్‌రాజ్ మరియు మీర్జాపూర్‌లో డాల్ఫిన్‌లను చూశానని, వన్యప్రాణులను సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితమని ఆయన పేర్కొన్నారు., రాణిపూర్‌లో పులుల సంరక్షణ కేంద్రం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అంతరించిపోతున్న పక్షుల కోసం ప్రభుత్వం రెస్క్యూ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని యోగి తెలిపారు.

ఇవి కూడా చదవండి: