Trolls on Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్.. అండగా ప్రముఖులు

Foreign Secretary Vikram Misri Trolled After Operation Sindoor Press Briefings: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్ మొదలైంది. కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల్లో ఆయన పేరు ఎక్కువగా వినిపించింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. అయితే, దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తొలిసారి ఆయనే వివరించారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పలుమార్లు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి మిస్రీ వివరాలను వెల్లడించారు.
ఇందులో భాగంగానే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణను సైతం మిస్రీనే వివరించారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా మిస్రీ కుటుంబంపై అభ్యంగా కామెంట్స్ చేశారు. మిస్రీ కుటుంబాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ సమయంలోనే మిస్రీతో పాటు ఆయన కూతురి ఫోన్ నంబర్ లీక్ చేశారు.
కాగా, మిస్రీపై వస్తున్న ట్రోలింగ్‌ను ఐఏఎస్, ఐపీఎస్ సంఘాలు ఖండించాయి. అలాగే మిస్రీకి రాజకీయ నేతలు సచిన్ పైలట్, అసదుద్దీన్, అఖిలేష్ యాదవ్ అండగా నిలిచారు. దీంతో పాటు మాజీ దౌత్యవేత్తలు మద్దతుగా నిలబడ్డారు.