BJP New party presidents: నాలుగు రాష్ట్రాల్లో నూతన పార్టీ అధ్యక్షులను నియమించిన బీజేపీ
భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అధిష్టానం నాలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు
BJP New party presidents: భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అధిష్టానం నాలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు. జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా బాబూలాల్ మరాండి, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కడ్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్‌ను అధిష్టానం నియమించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు.
ఏపీ, తెలంగాణలకు..( BJP New party presidents)
బండి సంజయ్ స్దానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయన కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసారు. బీజేపీ శాసన సభా పక్ష నేతగా కూడా పనిచేసారు. బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులయిన దగ్డుబాటి పురంధేశ్వరి 2004, 2009లో కాంగ్రెస్ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసారు. 2014 లో బీజేపీలో చేరిన పురంధేశ్వరి ప్రస్తుతం ఒడిశా బీజేపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు.