Hari Rama Jogaiah : అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని.. సీఎం జగన్ పై ఫైర్ అయిన హరిరామ జోగయ్య
మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య ఏపీ సీఎం జగన్ పై మరోసారి నిప్పులు చెరిగారు. అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని.. సీఎం జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు హరిరామ జోగయ్య ఒక బహిరంగ లేఖని తాజాగా విడుదల చేశారు. ఆ లేఖలో.. జగన్ పై తీవ్ర
Hari Rama Jogaiah : మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య ఏపీ సీఎం జగన్ పై మరోసారి నిప్పులు చెరిగారు. అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని.. సీఎం జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు హరిరామ జోగయ్య ఒక బహిరంగ లేఖని తాజాగా విడుదల చేశారు. ఆ లేఖలో.. జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలిచారు. ఆ లేఖని గమనిస్తే..
“మీ నాన్నగారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని.. తొలుత ఆయనను విమర్శించినా, ఆ తర్వాత ఆయన అభిమానిగా మారానని చెప్పారు. ప్రతిపక్ష నాయకులపై అప్పుడప్పుడు ఆయన చేసే విమర్శలు ఎంత హుందాగా ఉండేవో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ముఖ్యమంత్రిగా మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోందని.. అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోంది ముఖ్యమంత్రిగా మీ ప్రవర్తన చూస్తుంటే అని ఫైర్ అయ్యారు.
ప్రజల ఆరాధ్య నాయకుడయిన ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు విన్నాక మిమ్మల్ని సినిమాల్లోని విలన్ పాత్రధారిగా వర్ణించబోవచ్చేమో అనిపిస్తోంది. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్ళిల్లు చేసుకొంటే ప్రజలు కెవ్వరికీ లేని అభ్యంతరం మీకెందుకు? ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయి చట్టపరంగానే మరో పెళ్ళి చేసుకుంటే చట్టపరంగా తప్పేమిటి? ఉంఛుకుంటే తప్పు కాని, పవన్ కళ్యాణ్ పై బురద చల్లటానికి మరో కారణాలు లేకే ఇలాంటి చవకబారు కారణాలతోనే లబ్ధి పొందాలని మీరు చూస్తున్నట్లు ఉంది. మరోసారి చావకబారు విమర్శలు చేయక మీ నోరు జాగ్రత్త పెట్టుకుంటే మంచిది. మాట్లాడితే పవన్ కళ్యాణాన్ని చంద్రబాబుకి దత్తపుత్రుడు, వ్యాకేజీ అంటూ విమర్శిస్తూ ఉంటారు. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి K.C.RB దత్తపుత్రుడుగా 2019 ఎన్నికలలో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయిలు వ్యాకేజ్ తీసుకొని ఆంధ్రప్రదేశిని తెలంగాణాకు తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. మీ ఈ చర్యకు మీరు ఓట్లకు నోట్లను యివ్వ చూపిన ఓటర్లే ఇందుకు సాక్షులు.
మీ తాత రాజారెడ్డి దగ్గర నుండి మీ వరకు మీ కుటుంబం అందరికి దోచుకోవటం, దాచుకోవటం అలవాటే కదా. కాదని చెప్పగల దమ్ముందా మీకు లేక మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా??
ఇకముందు ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై అనవసరమైన దుర్భాషలాడటం మానుకొంటే బాగుపడ్డారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవటం ఏ సలహాదారు నేర్పారు మీకు. ఇలాంటి తప్పుడు కూతలు మీతో మాట్లాడించి మిమ్మల్ని ముంచటానికే అనిపిస్తుంది. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకుంటానికి ప్రయత్నం చేసుకోండి. మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి నాకు ఏర్పడినందుకు బాధగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితి అయింది. ఇది ప్రకాభిప్రాయం కనుక. నాకు మొదటి నుంచీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అలవాటు. వాళ్ళు అధికార పక్ష నేతైనా, ప్రతిపక్ష నేత అయినా స్వపక్ష నేత అయినా తప్పంటూ ఉంటే వాళ్ళ మొహం మీద కుండ బద్దలు కొట్టటం నా నైజం. సారీ.. అంటూ తన లేఖలో హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు.