Published On:

America on Pahalgam Terror Attack: ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు తేడా లేదు: USA

America on Pahalgam Terror Attack: ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు తేడా లేదు: USA

America Official Slams Pakistan Army Chief Asim Munir on Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన దాడిపై ప్రపంచం నివ్వెరపోయింది. అమెరికా సహా పలు దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఘటనపై పెంటగాన్ ( USA ) మాజీ అధికారి మైఖెల్ రుబిన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్ కు అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కు తేడా లేదన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఒసామా బిన్ లాడెన్ కు అసిమ్ మునీర్ కు పెద్దతేడాలేదని ఒకరు గుహలో నివసిస్తే మునీర్ రాజభవనంలో నివసిస్తున్నారని అన్నారు. పహల్గాం దాడికి ప్రత్యామ్నాయంగా మునిర్ ను ఉగ్రవాదిగా, పాకిస్తాన్ ను ఉగ్రప్రేరేపిత దేశంగా పరిగణించాలన్నారు.

బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్ష హోదాలో భారత్ లో పర్యటించినప్పుడు,  పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడిందన్నారు రుబిన్. ఇప్పుడు కూడా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భారత పర్యటనలో ఉన్నప్పుడు పహల్గాంలో దాడి చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈ దాడిలో మరణించిన 26మంది మృతదేహాలను వారి స్వస్థలాలకు చేరుకుని అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం భారత్ పాకిస్తాన్ పై దౌత్యపరమైన చర్యలను ప్రకటించింది. అందులో భాగంగా పాకిస్తాన్ సైనిక అటాచ్ లను బహిష్కరించింది. 1960నాటి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారి ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టు వెంటన్ మూసివేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ  ప్రకటించారు. మే 1 నాటికి పాకిస్తాన్ మరియు భారత హైకమిషన్ల మొత్తం సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించనున్నారు.

 

మంగళవారం పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునిర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల అనంతరం ఈ దాడి జరిగింది. భారత్ పై విషపూరిత ప్రసంగాలు చేయడంలో మునిర్ దిట్ట, గతవారం పాకిస్తాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మట్లాడుతూ ‘ కాశ్మీర్ ఒకప్పుడు పాకిస్తాన్ కు జీవనాడిలా ఉండేది. భవిష్యత్తులోనూ ఉంటుంది. మన కాశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని మనం ఒంటరిని చేయలేం. వారికి తోడుంటాం. మన ఉద్దేశం స్పష్టంగా ఉంది’ అని మునిర్ అన్నారు.