Published On:

Secretariat : సచివాలయం వద్ద ఇజ్రాయెల్ జెండా తొలగింపు.. యువకుడు అరెస్ట్

Secretariat : సచివాలయం వద్ద ఇజ్రాయెల్ జెండా తొలగింపు.. యువకుడు అరెస్ట్

Secretariat : రాష్ట్ర సచివాలయం సమీపంలో వివిధ దేశాలకు చెందిన జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 72వ ప్రపంచ సందరీమణుల పోటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేసింది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతంలో జాతీయ జెండా తొలగింపు తీవ్ర కలకలం రేపుతోంది. జకీర్ అనే యువకుడు సోషల్ మీడియాలో లైవ్ పెట్టి ఇజ్రాయెల్ జెండాను తొలగించాడు. ఇజ్రాయెల్-పాలస్తీనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ జెండాను తొలగించినట్లు తెలుస్తోంది. జెండాను తొలగించిన వీడియో వైరల్ అయ్యింది. వెంటనే అధికారులు తిరిగి జెండాను ఏర్పాటు చేశారు. జెండాను తొలగించే ప్రయత్నం జరుగుతోందని నెటిజన్లు ఎక్స్ వేదికగా నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెండాను తొలగించడం ఏమిటని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ సందర్భంగా జకీర్ అనే యువకుడిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తాజాగా యువకుడిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీస్ ట్వీట్ చేసింది.

 

ఇజ్రాయెల్ జాతీయ జెండాను తొలగించిన చర్య అనంతరం నగర పోలీస్ శాఖ వేగంగా చర్యలు తీసుకుందని స్పష్టం చేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నంబర్లు 138/2025, 141/2025 కింద రెండు కేసులు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. తదుపరి దర్యాప్తు జరుగుతోందని నగర పోలీస్ తెలిపింది.

ఇవి కూడా చదవండి: