CM KCR: మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలు మొదలుపెట్టండి.. సీఎం కేసిఆర్
ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Hyderabad: మునుగోడు ఉప ఎన్నిక ఘట్టం ముగిసింది. తెరాస అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డి గెలుపొందారు. ఈ క్రమంలో ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కార్యచరణ మొదలు పెట్టాలని పార్టీ నేతలకు తెరాస అధ్యక్షులు, సీఎం కేసిఆర్ సూచించారు.
తెరాస ప్రభుత్వం పై నమ్మకంతోనే కూసుగుంట్లను ప్రజలు గెలిపించారని కేసిఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర రెడ్డికి కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన్ను శాలువతో సత్కరించి ఆశీర్వదించారు. అభ్యర్ధి గెలుపుకు కృషి చేసిన నేతలను ఆయన అభినందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాల ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Union Minister Kishan Reddy: మునుగోడు ఉపఎన్నికలో భాజపా గెలిచి ఓడింది…కేంద్రమంత్రి కిషన్ రెడ్డి