Last Updated:

Nagarjuna Sagar: సాగర్ ఎడమ కాల్వకు గండి.. నీటమునిగిన నిడమానూరు..!

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిలేని వానలు కురుస్తున్నాయి. కాగా చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ఉద్ధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తోన్న వరదనీటి ప్రవాహాన్ని తాళలేక సాగర్ ఎడమ కాలువకు గండి పడింది.

Nagarjuna Sagar: సాగర్ ఎడమ కాల్వకు గండి.. నీటమునిగిన నిడమానూరు..!

Nagarjuna Sagar Left Canal Destroyed: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిలేని వానలు కురుస్తున్నాయి. కాగా చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ఉద్ధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తోన్న వరదనీటి ప్రవాహాన్ని తాళలేక సాగర్ ఎడమ కాలువకు గండి పడింది.

ఇటీవలే కురస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని నిడమానూరు మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడడంతో అక్కడున్న ప్రజలు ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో అని ఎక్కడ జలప్రలయం తమను ముంచేస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. కాగా ఇప్పటికే పలు గ్రామాలు నీట మునిగాయి. మరికొన్ని గ్రామాలకు ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. దానితో నిడమానూరు మండలం ఉన్న వ్యాప్తంగా ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.

మట్టికట్ట బలహీన పడటం వల్లే ముప్పారం సమీపంలో సాగర్‌ ఎడమ కాలువక గండి పడిందని అధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగే సమయంలో ఎడమ కాల్వలోకి సుమారు 7 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినట్టు భావిస్తున్నారు. స్థానిక రైతు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన అధికారుల వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలను ఆపేశారు.

సాగర్ కాల్వకు నీటి విడుదల గత నెల జులై 28 నుంచి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కాగా ఇప్పుడు గండిపడి పొలాలన్నీ మునిగిపోయాయి. ఇప్పటికే వందల ఎకరాల్లోని వరి నీటిపాలయ్యింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: