Published On:

Telangana Weather Update: రెయిన్ అలర్ట్.. రానున్న 3 రోజులు వర్షాలు

Telangana Weather Update: రెయిన్ అలర్ట్.. రానున్న 3 రోజులు వర్షాలు

Rain Expected in Telangana for Next Three Days: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలా మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

 

హైదరాబాద్‌తో పాటు యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

 

ఇదిలా ఉండగా, గత రెండు నెలలుగా రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. గతేడాదితో పోల్చితే ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వారం రోజులుగా విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. మరోవైపు అకాల వర్షాలు కూడా పడడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఎండలు, సాయంత్రం వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి.

 

కాగా, రానున్న 3 రోజులు ఎండ వేడిమి కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే సుమారు 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ శాఖ చెప్పింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం కానుంది. అయితే మార్పుల కారణంగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రైతులు వర్షాల సమయాల్లో చెట్ల కిందకు వెళ్లకూడదని సూచించింది. అంతేకాకుండా, ధాన్యం ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పింది.

 

మరోవైపు, హైదరాబాద్‌లో అకాల వర్షాలకు విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ మేరకు ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం ఉంటేనే రావాలని సూచించారు. అలాగే ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.