Last Updated:

Harish Rao: ‘నాడు ఎండిన చెరువులు.. నేడు నిండు కుండల్లా..’

తెలంగాణలో దశాబ్ది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తోంది. జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నుంచి 20 రోజుల పాటు పలు కార్యక్రమాలకు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది.

Harish Rao: ‘నాడు ఎండిన చెరువులు.. నేడు నిండు కుండల్లా..’

Harish Rao: తెలంగాణలో దశాబ్ది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తోంది. జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నుంచి 20 రోజుల పాటు పలు కార్యక్రమాలకు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జూన్ 8 న ‘ఊరూరా చెరువుల పండుగ’ను నిర్వహిస్తున్నారు. డప్పులు, బోనాలు, బతుకమ్మలతో సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. గోరటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుల మీద ఇతర కవులు రాసిన పాటలను జిల్లా కేంద్రాల్లో వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపులను ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తున్నారు. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్ట మీద సహపంక్తి భోజనాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

 

నిండు కుండల్లా చెరువులు..(Harish Rao)

‘ఊరూరా చెరువుల పండుగ’ ను పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ లో పోస్టు పెట్టారు.‘నాడు ఎండిపోయిన చెరువులు.. నేడు నిండు కుండల్లా చెరువులు.. నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం.. నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునరుజ్జీవం.. అందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం.. అమృత్ సరోవర్‌గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది.. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అని ట్విటర్‌ వేదికగా చెరువుల వైభవాన్ని వివరిస్తూ వీడియో పోస్టు చేశారు.