Last Updated:

Harish Rao : సీఎం రేవంత్‌‌రెడ్డితో హరీశ్‌‌రావు భేటీ.. అసలు విషయమిదే

Harish Rao : సీఎం రేవంత్‌‌రెడ్డితో హరీశ్‌‌రావు భేటీ.. అసలు విషయమిదే

Harish Rao : సీఎం రేవంత్‌రెడ్డిని ఇవాళ అసెంబ్లీలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మారావు కలిశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా సీఎంను కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎం రేవంత్‌ను కలిసినట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. సమావేశంలో పలు కీలక అంశాలపై హరీశ్‌రావు చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. సీతాఫల్‌మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంలో పద్మారావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డిని కలిశానని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీతాఫల్‌మండి కళాశాలకు రూ.32కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. కేసీఆర్ కేటాయించిన పనులను రేవంత్ సర్కారు అర్థాంతరంగా ఆపేసిందని హరీశ్‌రావు చెప్పారు.

 

 

కాంగ్రెస్, బీజేపీలు ‘బడే భాయ్.. చోటే భాయ్ బంధం’ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌ బయటపెట్టారన్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకపోయినా తన ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పల్లెత్తు మాట అనలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీకి తాము సమాన దూరంగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్‌ది తెలంగాణ ప్రజల పక్షమని తెలిపారు.

 

 

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ కంటే సభలో బీఆర్ఎస్‌ను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌పై తాను మాట్లాడినంత గట్టిగా ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. తాను రేవంత్‌రెడ్డి బట్టలు విప్పితే మహేశ్వరరెడ్డి రేవంత్‌ను కవర్ చేశారన్నారు. కాంగ్రెస్ పిలిస్తే పోవటం లేదని డీఎంకే నేతల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెన్నై వెళ్తున్నారని తెలిపారు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై మెదట మాట్లాడిందే బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. డీలిమిటేషన్‌పై కాంగ్రెస్‌కు స్టాండ్ లేదు.. క్లారిటీ లేదని హరీశ్‌రావు విమర్శించారు.

ఇవి కూడా చదవండి: