Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు శ్రవణ్‌రావు

Big Twist in Phone Tapping Case Accused Sravan Rao Attended To SIT: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరవ నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా ఆయన దుబాయ్ నుంచి తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడినుంచి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు.
ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఆరో నిందితుడిగా శ్రవణ్ రావు ఉండగా.. ఆయన అమెరికాకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. గతంలో ఆయన ఓ మీడియా సంస్థను నడుపుతుండగా.. గతేడాది మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఫోన్ ట్యాంపింగ్ కేసు విషయంలో ఆయన తొలు లండన్ వెళ్లారు. ఆ తర్వాత అక్కడినుంచి అమెరికాకు వెళ్లారు. దీంతో ఆయన సిట్ విచారణకు రావడం లేదు. ఇటీవల ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు అందజేసింది.
అయితే, శ్రవణ్ రావుకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. దీంతో ఈ విచారణలో అరెస్ట్ చేయొద్దని తీర్పు రావడంతో కాస్తా ఉపశమనం దొరికింది. అయితే పోలీసుల దర్యాప్తునకు సహకారం అందించానలి నిబంధన పెట్టింది. దీంతో ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు.
ఈ కేసు విషయంలో జూబ్లీహిల్స్ పీఎస్‌లో శ్రవణ్ రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఐదు గంటలుగా శ్రవణ్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాంపిగ్‌లో వెనుక ప్రధాన సూత్రధారి ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులతో శ్రవన్ రావుకు ఉన్న పరిచయాలపై ఆరా తీశారు. ఫోన్ ట్యాంపింగ్ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారని సిట్ ఆరా తీశారు.