Home / Harish Rao
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్యంతో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయ్యాయని, అయినా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశతో టన్నెల్ వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 8 మంది ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందన్నారు. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. […]
Harish Rao : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చేస్తున్న పనుల గురించి తనకు చాలా ఆందోళనగా ఉందని, రాహుల్ చెప్పే సూత్రాలకు వారు విరుద్ధంగా పని చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మీరు రాజ్యాంగాన్ని కాపాడాలని చెబుతారు.. కానీ తెలంగాణలో మీ పార్టీ సీఎం దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ 2024 ఎన్నికల హామీల్లో, పార్టీ మారిన […]
Harish Rao : రైతు భరోసా పథకం అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా మాట తప్పడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రైతులకు చేదు అనుభవం మిగిల్చింది.. గణతంత్ర దినోత్సవం నాడు రైతుభరోసా పథకం కింద ఇచ్చే డబ్బులను మార్చి […]
Harish Rao : సీఎం రేవంత్‌రెడ్డిని ఇవాళ అసెంబ్లీలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మారావు కలిశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా సీఎంను కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎం రేవంత్‌ను కలిసినట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. సమావేశంలో పలు కీలక అంశాలపై హరీశ్‌రావు చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. సీతాఫల్మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంలో పద్మారావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని చెప్పారు. […]
Harish Rao : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మార్పు పేరుతో అనేక వాగ్దానాలు ఇచ్చారని, గెలిచిన తర్వాత హామీలను నెరవేర్చడం మార్చిపోయారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని, ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై ఇవాళ జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నీతులు చెప్పారని దుయ్యబట్టారు. గతేడాది బడ్జెట్‌తో […]
Harish Rao Big Relief : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్‌టాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను ధర్మాసనం కొట్టివేసింది. పంజాగుట్ట పీస్‌లో ఫోన్ టాపింగ్ కేసు నమోదైంది. రియల్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియగా, ఇవాళ హైకోర్టు తీర్పు […]
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బయట బూతులు మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతారు అనుకున్నామని, కానీ బూతులతోపాటు అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ బూతు పిత అయ్యారని విమర్శించారు. బూతు సినిమాకు పనికొచ్చే స్క్రిప్ట్ లాగా ముఖ్యమంత్రి ఉపన్యాసం ఉందని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ […]
Harish Rao : ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ కోరుకున్నారని, అందుకే ఇవాళ శాసనసభలో ముఖ్యమంత్రి స్పీచ్‌ను బహిష్కరించామన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించి మాట్లాడారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్సే అని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ […]
Harish Rao : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో శనివారం జరిగిన మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ విపక్షంలో ఉన్నప్పుడు మొదలు పెట్టి అధికారంలోకి వచ్చాక కూడా అబద్ధాలు మాట్లాడటం మానుకోలేదని విమర్శించారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పాలనలో మహిళా సంఘాలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని […]
Harish Rao : కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని, కాళేశ్వరం కుంగింది అన్నవారికి, నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కండ్లు తెరవాలని, లేకపోతే చరిత్ర క్షమించదన్నారు. బుధవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. రంగనాయక సాగర్‌లోకి కాళేశ్వరం పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల […]