Published On:

Fat Burn: బరువు తగ్గడానికి పరిష్కారాలు ఇవే!

Fat Burn: బరువు తగ్గడానికి పరిష్కారాలు ఇవే!

 

Fat Burn: అధిక బరువు (Over weight) అంటే శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా కొవ్వు పేరుకపోవడం. ఇది మనిషి ఎత్తు మరియు బరువును కొలవడం ద్వారా బాడీ మాస్ ఇండెక్స్ నిర్ధారించడుతుంది. బాడీ ఇండెక్స్ (BMI) 25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు అధికబరువును కలిగి ఉన్నారని అర్ధం.

fat burn process

fat burn process

అధికబరువుకు అనేక కారణాలు ఉన్నాయి. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోతే దాని ప్రభావం మొదటగా మోకాళ్లమీద పడుతుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. దీంతో పాటే తినే ఆహారం. జీవనశైలి కూడా ఉంటుంది. వీరు అధికబరువును కలిగి ఉంటారు. వీరికి గుండె సంబంధమైన జబ్బులు, షుగర్, హై బ్లడ్ ఫ్లెజర్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

 

అధికబరువును కంట్రోల్ చేయడానికి ఆహారంపై శ్రద్ద అవసరం. క్రమం తప్పని శారీరక వ్యాయామం ఒంట్లోని కొవ్వును కరిగించి ఆరోగ్యంగా ఉంచి చక్కని ఆకృతిని ఇస్తుంది.  బాడీ ఇండెక్స్ (BMI) 30లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అధికబరువుకింద లెక్కిస్తారు. వీరిని ఊబకాయులుగా గుర్తిస్తారు.

 

మహిళలలో బరువు పెరగడానికి గల కారణాలు
హార్మోన్లలో అసమానత వలన మహిళలు బరువుపెరుగుతారు.  హార్మోన్ల అసమానత ఆహారపు అలవాట్లనుంచి వస్తుంది. ఎక్కువగా జంక్ ఫుడ్ తినే వాళ్లు బరువు పెరగడంతో పాటు హార్మోన్ల అసమానతలకు గురవుతారు.

 

Low Carb, High Protein Diet
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. శనగలు, చేపలు, పెరుగు, మినుములు, కందులు లాంటి వాటిని తీసుకోవాలి. వీటితో పాటే బ్రౌన్ రైస్, రాగులు, జొన్నలు, మిల్లెట్స్ ఆహారంలో విధిగా ఉండేలా చూసుకోవాలి. గ్రీన్ టీ, ఆపిల్, లెమన్ వాటర్ తీసుకుంటుండాలి.

fat burn tea

fat burn tea

చక్కర, ప్రాసెస్డ్ ఫుడ్. జంక్ ఫుడ్ లాంటివాటికి దూరంగా ఉండాలి. రోజుకు 8గంటల నిద్ర తప్పనిసరి, నిద్రకు గంట ముందు భోజనం చేయడం తప్పనిసరి. రాత్రి భోజనం పూర్తయ్యాక 15నిమిషాలు తప్పక వాకింగ్ చేయాలి. రోజుకు 3-4 లీటర్ల నీటిని త్రాగాలి.

 

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగాలి. టిఫిన్ లో ఓట్స్, ఉడికించిన గుడ్లు, జొన్నరోట్టె, ఫ్రూట్స్ తీసుకోవచ్చు.

 

లంచ్ లో పోషకాలు అందేలా చూసుకోవాలి. మిక్స్డ్ వెజిటెబుల్ సలాడ్ కరీ, బ్రౌన్ రైస్. జొన్న రొట్టె, రాజ్మా, పెరుగు ఉండేలా చేసుకోండి.

 

రాత్రి డిన్నర్ లో తేలికపాటి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అందుకు పెసరపప్పు, గ్రిల్డ్ పనీర్, గోరు వెచ్చని పాలు, జొన్న రోట్టె తీసుకోవాలి.

 

గమనిక: బరువు తగ్గించే ఆహారాన్ని తీసుకునేటప్పుడు డాక్టర్ ను న్యూట్రీషన్ ను తప్పక సంప్రదించగలరు.ఈ సమాచారం చికిత్సకాదు. వీటిని పాటించే ముందు డాక్టర్ ను కలవగలరు. ఖచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.