Published On:

Telangana News: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. త్వరలోనే అకౌంట్లోకి బోనస్ డబ్బులు

Telangana News: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. త్వరలోనే అకౌంట్లోకి బోనస్ డబ్బులు

Minister Uttam kumar reddy good news about farmers bonous amount: రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులు విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘రైతు మహోత్సవం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కేంద్రం ప్రకటించిన పసుపు బోర్డు ఏమైందనే విషయం స్థానిక ఎంపీ అరవింద్ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి శాఖపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా అదనంగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులు నిర్మించి పూర్తిచేసింటే ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పాలనలో నిజాంసాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టులు నిర్మించినట్లు గుర్తు చేశారు.

 

ఇందులో భాగంగానే నిజామాబాద జిల్లాకు మరిన్ని డ్యామ్‌లు తీసుకొస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం లక్షకోట్లతో నిర్మించిన కళేశ్వరం వంటి ప్రాజెక్టు మూడేళ్లకు కూలిందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందని, సాగుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు.