iPhone 16 Offers: ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఈ ఐఫోన్ మాత్రమే తీసుకోండి.. ఇంక ఏది తీసుకున్నా..!

iPhone 16 Offers: గత కొన్ని సంవత్సరాలుగా, ప్రముఖ ఫోన్ తయారీదారు యాపిల్ ప్రతి సంవత్సరం తన కొత్త మోడల్‌ను విడుదల చేస్తోంది. ఈసారి ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. అంతకు ముందే ఈ ఫోన్ గురించి సమాచారం ఆన్లైన్లో లీక్ అవుతోంది. యాపిల్ లవర్స్ ఐఫోన్ 17 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, అయితే, ప్రస్తుతం కొంతమంది కస్టమర్లు యాపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ ధర తగ్గుతుందని చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ ఐఫోన్ 17 లాంచ్ కాకముందే ధర తగ్గుతోంది.
ఐఫోన్ 16 ను యాపిల్ చౌకగా చేయలేదు, కానీ ఐఫోన్ 16 ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో చౌకగా మారింది. నిజానికి, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమైంది. ఈ సమయంలో ఐఫోన్ 16 పై వివిధ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. దీని కారణంగా ఫోన్‌ను వాస్తవ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Flipkart Sasa Lele Sale
ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న సాసా లేలే సేల్ మే 1, 2025 నుండి మే 8, 2025 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఇతర ఉత్పత్తులను చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఐఫోన్ 16 128 GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ డిస్కౌంట్‌తో లభిస్తుంది.
iPhone 16 Discounts
ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ సమయంలో ఐఫోన్ 16 128 GB వేరియంట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 79,900 కానీ ఐఫోన్ 16 ను ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 69,999 కు కొనుగోలు చేయవచ్చు. దీని ధరపై రూ.9,901 ప్రత్యక్ష తగ్గింపు ఇస్తున్నారు. మీరు ఇతర ఆఫర్ల ద్వారా iPhone 16 ధరపై మరిన్ని తగ్గింపులను పొందచ్చు.
iPhone 16 Bank Offers
మీరు ఐఫోన్ 16 కొనడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని పొందచ్చు. ఇది కాకుండా, ఐఫోన్ 16 ను EMI ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు నెలకు రూ. 2,461 ప్రారంభ EMIతో iPhone 16 ను కొనుగోలు చేయచ్చు.
iPhone 16 Exchange Offers
మీరు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఐఫోన్ 16 ధరపై మరింత తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 16 పై రూ. 38,150 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- 5G Budget Phones: అమెజాన్ సేల్.. జస్ట్ రూ.10 వేల లోపు ధరకే 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్.. లిస్ట్ లో ఏఏ బ్రాండ్ ఫోన్స్ ఉన్నాయంటే..!