Telangana News: జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు.. వేదికపైనే స్పీకర్, మంత్రి కరాటే!

Speaker vs Minister an Interesting Scene National karate event in Hyderabad: హైదరాబాద్‌లో జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ మేరకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 4వ కియో జాతీయ కరాటే పోటీలకు ముఖ్యఅతిథిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కరాటేలో ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు.
అయితే ఈ పోటీల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కరాటె బెల్ట్‌లు అందుకున్న తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ఇద్దరూ కరాటే ఫోజులు ఇచ్చారు. కరాటే డ్రెస్స్‌లు వేసుకోవడంతో కరాటే చేసేలా కనిపించారు. కాసేపు స్పేరింగ్ చేసి నవ్వుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వేదికపైనే ఇలా సరదాగా ఫోజులు ఇవ్వడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గచ్చిబౌలిలో నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ pic.twitter.com/slBnbSyMLj
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2025