Last Updated:

BJP Leaders : ఈటల రాజేందర్, అరవింద్ లకు.. వై ప్లస్, వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం..

భారతీయ జనతా పార్టీ తెలంగాలోని ఇద్దరు కీలక నేతలకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్.. అలాగే నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్ లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్రం..

BJP Leaders : ఈటల రాజేందర్, అరవింద్ లకు.. వై ప్లస్, వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం..
BJP Leaders : భారతీయ జనతా పార్టీ తెలంగాలోని ఇద్దరు కీలక నేతలకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్.. అలాగే నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్ లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్రం.. ఎమ్మెల్యే ఈట‌ల రాజేందర్‌కు ‘వై ప్లస్’.. ఎంపీ అరవింద్ కు ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించింది.
కాగా ఇప్పటికే ఈటల రాజేందర్‌కు తెలంగాణ సర్కార్‌ ‘వై ప్లస్‌’ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రకటించిన భద్రత చర్యల్లో భాగంగా.. వై ప్లస్ కేటగిరీ కింద 11 మంది, వై కేటగిరీ కింద 8 మందితో భద్రత కల్పించనున్నారు. అలాగే ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహానాలను కేటాయించింది. దీంతో ఈ ఇద్దరు బీజేపీ నేతల నివాసాలకు సీఆర్ఫీఎఫ్ ఉన్నతాధికారులు వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్లుగా సమాచారం.
ఇటీవల ఈటల రాజేందర్ కి ప్రాణ హాని ఉందని.. ఆయన భార్య జమున మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని, తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని.. ఆమె వాపోయారు. అదే విధంగా తనకు ప్రాణహాని ఉందని స్వయంగా ఈటల రాజేందర్ కూడా వెల్లడించారు. దీంతో కేంద్రం స్పందించి ఆయనకు వై ప్లస్ కే టగిరి భద్రతను కల్పించింది.