Last Updated:

Ganesh Nimajjanam: హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్దం

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై వివాదం తొలగిపోయింది. రేపటి నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ పై జిహెచ్ఎంసి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాల కోసం ఏకంగా 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గంలో 9, పీవీ మార్గ్ లో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు.

Ganesh Nimajjanam: హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్దం

Hyderabad: హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై వివాదం తొలగిపోయింది. రేపటి నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ పై జిహెచ్ఎంసి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాల కోసం ఏకంగా 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గంలో 9, పీవీ మార్గ్ లో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్‌లో 354 కిలోమీటర్ల మేర గణేష్ శోభ యాత్ర సాగనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

మట్టి వినాయకులతో పాటు ప్లాస్టరాఫ్ ప్యారీస్ విగ్రహాలను సైతం నిమజ్జనానికి అనుమతిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నిమజ్జనం సమయంలో 10 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. నిమజ్జనాల పర్యవేక్షణకు 168 మంది సిబ్బంది ఉంటారు. ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.

శుక్రవారం సెలవు..

గణేష్ నిమజ్జనం సందర్బంగా శుక్రవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాల్లో సెలవు అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: