Published On:

Horoscope for Friday, May 02, 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఒడిదుడుకులు!

Horoscope for Friday, May 02, 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఒడిదుడుకులు!

Horoscope for Friday, May 02, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

 

మేషం: ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

వృషభం: ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వివాదాలకు చాలా దూరంగా ఉండండి ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పొందుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి.

మిథునం: పనులు శ్రమానాంతరం పూర్తవుతాయి. ఉన్నత హోదాల్లోని వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు.

 

కర్కాటకం: అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. ఆర్థిక ప్రణాళికలను క్రమపద్ధతిలో రూపొందించు కోగలుగుతారు విదేశీయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం.

సింహం: వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మీకు సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు.

కన్య: వృత్తి, ఉద్యోగ – వ్యాపారాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీలో ధైర్యానికి మీరే ఆశ్చర్యపోతారు. కొన్ని సమస్యలను రూపుమాపుకుంటారు.

 

తుల: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. లాభాలు అంతంతమాత్రమే ఉంటాయి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్థి వివాదాలు తీరి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతకు కారణం అవుతుం ది.

ధనుస్సు: పారిశ్రామిక, విద్యా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలు చేతికి అందుతాయి. కొన్ని వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

 

మకరం: ఆర్థిక పురోభివృద్ధిని కొంతవరకైనా సాధించగలుగుతారు. కొన్ని విషయాలలో నిదానంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో బంధువుల సహాయం పొందుతారు.

కుంభం: ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరిస్థితి లాభసాటిగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్న విధంగా ఉంటుంది.

మీనం: సకాలంలో అనుకున్న విధంగా పనులను పూర్తి చేయగలుగుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు స్థిరాస్తుల వ్యవహారాలు క్రమబద్ధీలో ఉంటాయి.