Last Updated:

AP Assembly: అసెంబ్లీలో ఉద్రిక్తత.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైసీపీ, తెదేపా ఎమ్మెల్యేలు

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ, తెదేపా ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన స్పీకర్.. 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

AP Assembly: అసెంబ్లీలో ఉద్రిక్తత.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైసీపీ, తెదేపా ఎమ్మెల్యేలు

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ, తెదేపా ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన స్పీకర్.. 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

అసెంబ్లీలో ఉద్రిక్తత.. (AP Assembly)

ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ, తెదేపా ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన స్పీకర్.. 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. జీఓ నెం 1 పై చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టగా.. వారి తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెదేపా ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పరస్పరం దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం 11 మంది తెదేపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.

11 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒక్కరోజుపాటు సస్పెండ్ చేశారు.

అసెంబ్లీలో విద్యుత్ మీటర్లపై చర్చించడానికి తెదేపా ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ మేరకు స్పీకర్ పోడియనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంత చెప్పినా వినకుండా ఆందోళన కొనసాగించారు. సభలో గందగరగోళం నెలకొంది.

దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.

శాసనసభ చరిత్రలో చీకటి రోజు: అచ్చెన్నాయుడు

శాసనసభ నుంచి తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై తెదేపా నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శాసనసభ చరిత్రలో చీకటి రోజు అని అయన అన్నారు.

టీడీపీ కి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి పై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఆరోపించారు.

75 ఏళ్ల వయసున్న వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యపై మాజీ మంత్రి వెల్లంపల్లి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.