Published On:

AP EAPCET Hall Tickets Out Now: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు రిలీజ్!

AP EAPCET Hall Tickets Out Now: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు రిలీజ్!

AP EAPCET Hall Tickets Released Now: ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు నేటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్ సీఎస్ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం మొత్తం 3,61,299 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం https://cets.apsche.ap.gov.in/ లింక్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

 

అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వ వాట్సాప్ నంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ పంపి హాల్ టికెట్లను పొందవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఈ ఏడాది పరీక్ష కేంద్రాలను సులువుగా తెలుసుకునేందుకు హాల్ టికెట్‌లోనే రూట్ మ్యాప్ ఇచ్చినట్లు చెప్పారు. ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే 0884-2359599, 2342499 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని సూచించారు.

 

ఏపీ ఈఏపీసెట్ మే 19 న ప్రారంభమై మే 27 ముగియనుంది. ఈ పరీక్షలు ఆన్ లైన్ విధానంలోనే జరగనున్నాయి. అగ్రికల్చర్, ఫార్మాసీ కోర్సు కోసం మే 19, 20వ తేదీల్లో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తుండగా.. ఇంజినీరింగ్ కోర్సు కోసం మే 21 నుంచి 27 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్ ఫస్ట్ కీని మే 21న, ఇంజినీరింగ్ కీని మే 28న విడుదల చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు.