Heavy Discount: అత్యధిక తగ్గింపు.. ఐఫోన్‌పై భారీగా డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అసలు తగ్గడం లేదు..!

Heavy Discount: ఐఫోన్ 16 భారతదేశంలో సెప్టెంబర్ 2024లో ప్లస్, ప్రో, ప్రో మాక్స్ వేరియంట్లతో పాటు విడుదలైంది. బేస్ వెర్షన్ 3ఎన్ఎమ్ ఆక్టా-కోర్ A18 చిప్‌సెట్‌ను పొందుతుంది.128GB, 256GB, 512GB స్టోరేజ్ ఎంపికలలో వస్తుంది. లాంచ్ సమయంలో ఐఫోన్ 16 ధర రూ.79,900 నుండి ప్రారంభమైంది. ఇప్పుడు 128GB వేరియంట్ రూ.69,500 వరకు లభిస్తుంది. ఎంపిక చేసిన ఆన్లైన్ రిటైలర్లు ఈ హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరకు అందిస్తున్నారు. కొన్ని బ్యాంక్ ఆఫర్లు ధరను మరింత తగ్గించవచ్చు.
iPhone 16 Offers
ఐఫోన్ 16 128GB ఆప్షన్ అమెజాన్‌లో రూ. 73,500 కు జాబితా చేశారు, ఇది లాంచ్ ధర కంటే రూ. 6,400 తక్కువ. అదనంగా, ఐసిఐసిఐ, కోటాక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 4,000 తక్షణ తగ్గింపును పొందచ్చు, దీని వలన భారతదేశంలో iPhone 16 ధర రూ. 69,500కి చేరుకుంది. ఇక్కడ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే.
మరో ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ కూడా ఐఫోన్ 16 ను లాంచ్ ధర కంటే తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB వేరియంట్ రూ.74,900 కు లభిస్తుంది. ఈ ధర తగ్గింపుతో పాటు, వినియోగదారులు ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులను ఉపయోగించి రూ. 4,000 తక్షణ తగ్గింపును కూడా పొందచ్చు, దీనితో ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 70,900 కి చేరుకుంటుంది. ఇక్కడ కూడా కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
iPhone16 Specifications
ఐఫోన్ 16 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను 2,000 నిట్ల వరకు పీక్ బ్రైట్నెస్, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్ష, డైనమిక్ ఐలాండ్ ఫీచర్లతో వస్తుంది. ఇది 3ఎన్ఎమ్ ఆక్టా-కోర్ A18 చిప్సెట్తో లాంచ్ అయింది. 512GB వరకు ఆన్‌బోర్డ్ నిల్వకు సపోర్ట్ ఇస్తుంది. ఈ హ్యాండ్సెట్ iOS 18 పై రన్ అవుతుంది.
ఫోటోగ్రఫీ కోసం, iPhone 16 వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్,12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను పొందుతుంది. అదే సమయంలో, ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ ట్రూడెప్త్ సెల్ఫీ ఉంది. అల్ట్రావైడ్ కెమెరా మాక్రో ఫోటోగ్రఫీకి కూడా సపోర్ట్ ఇస్తుంది. బేస్ iPhone 16 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC,USB టైప్-C కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Amazon Mobile Offers: ఇంత తక్కువ.. వన్‌ప్లస్, సామ్సంగ్ ఫోన్లపై వేల రూపాయల డిస్కౌంట్.. అమెజాన్ ఆహా అనిపించింది..!